Header Banner

కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని పూర్తి సద్వినియోగం చేసుకుంటాం - పవన్ కల్యాణ్! కేంద్ర బడ్జెట్‌పై కీలక వ్యాఖ్యలు!

  Sat Feb 01, 2025 19:48        Politics

వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ అవసరాలంకంటే దేశం, ప్రజలు ముఖ్యం అనే సమున్నత దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనిపించిందన్నారు. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని గుర్తు చేశారు. రూ.12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు వల్ల ఉద్యోగ వర్గాలకు పెద్ద ఊరట కలిగించే అంశమన్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 



ఈ తరహా సంస్కరణలు కచ్చితంగా మధ్యతరగతి వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయన్నారు. పీఎం ధన్ ధాన్య యోజన పథకం ద్వారా వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు గిడ్డంగుల నిర్మాణానికి, నీటిపారుదల వ్యవస్థ ఆధునికీకరణ, రుణ సదుపాయాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభిస్తుండటం హర్షణీయమన్నారు. కిసాన్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచడం స్వాగతించదగ్గ అంశమన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్లోనూ కొనసాగించారని వెల్లడించారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం వల్ల రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న ఆ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసే అవకాశం లభిస్తుందన్నారు. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందని వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.3,295 కోట్లు కేటాయించడం ద్వారా ప్లాంట్ పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోమారు స్పష్టమైందని తెలిపారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #bharath #unionbuget #DeputyCm #Pawankalyan #todaynews #flashnews #latestupdate